ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-12-27T04:29:53+05:30 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు కావడంపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది.

ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలపై ఫిర్యాదు

తడ, డిసెంబరు 26 : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు తీవ్రగాయాలు  కావడంపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసుల వివరాల మేరకు మండలంలోని బాలకృష్ణాపురంకుప్పం, కాశీంగాడుకుప్పం గ్రామాలకు చెందిన మత్స్యకార మహిళలు గుమ్మిడిపూడిలో చేపలు అమ్ముకుంటుంటారు. రోజులాగే గత 22వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు ఆరంబాకం నుంచి ఆటోలో గుమ్మిడిపూడికి బయలుదేరారు. మార్గ మధ్యంలో రామాపురంకుప్పం వద్ద ముందు వెళ్తున్న లారీ సడన్‌బ్రేక్‌ వేయడంతో ఆటో లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దేవమ్మ, అంజలి  తీవ్రంగా గాయపడ్డారు. తమిళనాడుకు చెందిన 108 వాహనం క్షతగాత్రులను గుమ్మిడిపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించింది. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-12-27T04:29:53+05:30 IST