లారీని ఢీకొన్న పరిశ్రమ బస్సు

ABN , First Publish Date - 2021-08-04T03:34:52+05:30 IST

లారీ సడన్‌ బ్రేక్‌ వేయడంతో అదే దారిలో వెనుక వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది.

లారీని ఢీకొన్న పరిశ్రమ బస్సు

తడ, ఆగస్టు 3 : లారీ సడన్‌ బ్రేక్‌ వేయడంతో అదే దారిలో వెనుక వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. మంగళవారం మాంబట్టు సెజ్‌లోని అపాచీ పరిశ్రమకు కార్మికులను తీసుకువెళ్లిన బస్సు తిరిగి సూళ్లూరుపేటకు వస్తోంది. ఈ క్రమంలో అదే దారిలో నెల్లూరు వైపు ఓ కంటైనర్‌ లారీ వెళ్తూ పులివేంద్ర జాతీయ రహదారి వద్ద సడన్‌ బ్రేక్‌ వేయడంతో వెనుకనే వేగంగా వస్తున్న బస్సు లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. బస్సులో డ్రైవర్‌ తప్ప మరెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. లారీ-బస్సు సిబ్బంది పరస్పర అవగాహనతో ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. పోలీసులకు సమాచారం లేదు.

Updated Date - 2021-08-04T03:34:52+05:30 IST