గొర్రెల మందపై కుక్కల దాడి

ABN , First Publish Date - 2021-12-19T12:48:34+05:30 IST

ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లెలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 63 గొర్రెలు మృతి చెందాయి. బ్రాహ్మణపల్లెకు చెందిన బోయ రమేష్‌ గ్రామ సమీపాన గొర్రెల మందను

గొర్రెల మందపై కుక్కల దాడి

కర్నూలు: ఓర్వకల్లు మండలంలోని బ్రాహ్మణపల్లెలో గొర్రెల మందపై కుక్కలు దాడి చేయడంతో 63 గొర్రెలు మృతి చెందాయి. బ్రాహ్మణపల్లెకు చెందిన బోయ రమేష్‌ గ్రామ సమీపాన గొర్రెల మందను కల్లందొడ్డిలో ఉంచాడు. అతను అర్ధరాత్రి ఇంటికి వెళ్లడంతో శనివారం తెల్లవారుజామున గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఇంటికి వెళ్లి యజమాని గొర్రెల మంద వద్దకు చేరుకునేలోపే 63 గొర్రెలు మృతి చెందాయి. ఆ యజమాని కుక్కలను తరిమివేశాడు. వీటి విలువ దాదాపు రూ.5 లక్షలు ఉంటుందని గొర్రెల యజమాని బోయ రమేష్‌ వాపోయారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే రాష్ట్ర గొర్రెల పెం పకందారుల ఫెడరేషన్‌ చైర్మన్‌ వై.నాగేశ్వరరావుయాదవ్‌ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. బాధితుడికి రూ.5వేల నగదును అందజేశారు. ప్రభుత్వ పరంగా రావాల్సిన నష్ట పరిహారం వచ్చేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Updated Date - 2021-12-19T12:48:34+05:30 IST