తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-21T04:59:18+05:30 IST

మండలంలోని బూరుగుల గ్రామంలో తండ్రి మందలించాడని సాయి ప్రణీత్‌ కుమార్‌(27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

తండ్రి మందలించాడని యువకుడి ఆత్మహత్య

ప్యాపిలి, అక్టోబరు 20: మండలంలోని బూరుగుల గ్రామంలో తండ్రి మందలించాడని సాయి ప్రణీత్‌ కుమార్‌(27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బూరుగుల గ్రామానికి చెందిన పూజారి రామారావు, అరుణ దంపతుల రెండో కుమారుడు సాయిప్రణీత్‌ కుమార్‌ డిగ్రీ వరకు చదివాడు. ఉద్యోగం రాకపోవడంతో పూజారి వృత్తిని చేసుకొనేవాడు. అయితే తనకు ఆరోగ్యం సరిగా లేదని గ్రామంలోని ఆలయాల్లో పూజలు చేయాలని తండ్రి రామారావు కొడుకుకు సూచించారు. ఇందుకు సాయి ప్రణీత్‌ ఒప్పుకోకపోవడంతో తండ్రి మందలించారు. యువకుడు బాత్‌రూంలోనికి వెళ్లి దూలానికి ఉరివేసుకున్నాడు. ఇరుగు పొరుగు వారు బాత్‌రూం వాకిళ్లు పగులగొట్టి  యువకుడిని చికిత్స నిమిత్తం డోన్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు రాచెర్ల ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  

Updated Date - 2021-10-21T04:59:18+05:30 IST