264 మద్యం బాటిళ్లు సీజ్
ABN , First Publish Date - 2022-01-01T05:22:17+05:30 IST
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న 246 బాటిళ్లను సీజ్ చేశామని కర్నూలు స్పెషల్ ఎన్పోర్సు మెంట్ బ్యూరో సీఐ ఎం. సత్యనారాయణ తెలిపారు.
కర్నూలు(అర్బన), డిసెంబరు 31: తెలంగాణ నుంచి అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న 246 బాటిళ్లను సీజ్ చేశామని కర్నూలు స్పెషల్ ఎన్పోర్సు మెంట్ బ్యూరో సీఐ ఎం. సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం కర్నూలు మండలం జి. సింగవరంలోని కేసీ కెనాల్ బ్రిడ్జి వద్ద ఎస్‌ఐ టి ప్రసాదరావు ఆధ్వర్యంలో తనిఖీలు చేయగా తెలంగాణ మద్యాన్ని కారులో తరలిస్తున్నట్లు గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. తెలంగాణకు చెందిన బోయ రాజశేఖర్, బోయ జగదీష్, శేఖర్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపామని తెలిపారు.