మానసిక వికాసానికి క్రీడలు: జిల్లా చీఫ్ కోచ్ శ్రీనివాసరావు
ABN , First Publish Date - 2021-12-19T06:16:36+05:30 IST
మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని కృష్ణా జిల్లా చీఫ్ కోచ్ బి. శ్రీనివాసరావు అన్నారు.
మానసిక వికాసానికి క్రీడలు: జిల్లా చీఫ్ కోచ్ శ్రీనివాసరావు
రామలింగేశ్వరనగర్, డిసెంబరు 18 : మానసిక వికాసానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని కృష్ణా జిల్లా చీఫ్ కోచ్ బి. శ్రీనివాసరావు అన్నారు. కృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ శనివారం మారిస్ స్టెల్లా కళాశాలలో ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థినులు క్రీడల్లో రాణించాలన్నారు. గౌరవ అతిఽథులు పాల్ ఇమ్మానియేల్, విక్రాంత్ పబ్లిషర్స్ ఎండీ చక్రవర్తి మాట్లాడుతూ మహిళలు క్రీడల్లో రాణించాలని, మంచి భవిష్యత్‌కు క్రీడలు దోహదపడతాయన్నారు. కళాశాల కర స్పాండెంట్ సిస్టర్ స్లీవా, ప్రిన్సిపాల్ జసింతా క్వాడ్రన్, పీడీ వినీల, కోచ్ రాజు, డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఇన్నాసియా, అనూహ్య, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. కృష్ణా యూనివర్సిటీ కమిటీ సభ్యులు, టీమ్ మేనేజర్లు, వివిధ కళాశాలల క్రీడాకారులు పాల్గొన్నారు.