ట్రూ అప్‌ చార్జీలను పూర్తిగా రద్దుచేయాలి

ABN , First Publish Date - 2021-10-20T06:12:40+05:30 IST

కరోనా కష్టాల్లోం చి ప్రజలు ఇంకా తేరుకోలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ట్రూ అప్‌ చార్జీల పేరుతో భారాలు మోపడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌. బాబూరావు విమర్శించారు.

ట్రూ అప్‌ చార్జీలను పూర్తిగా రద్దుచేయాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బాబూరావు

పాయకాపురం, అక్టోబరు 19 : కరోనా కష్టాల్లోం చి ప్రజలు ఇంకా తేరుకోలేదని, ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ట్రూ అప్‌ చార్జీల పేరుతో భారాలు మోపడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌. బాబూరావు విమర్శించారు. ట్రూ అప్‌ చార్జీల భారంపై విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌ జరిపిన ఆన్‌లైన్‌ బహిరంగ విచారణలో సీపీఎం ఆంధ్రప్రదేశ్‌  కమిటీ తరపున రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సీహెచ్‌. బాబూరావు మంగళవారం పాల్గొని ప్రజాభిప్రాయాన్ని వెల్లడించారు. 2014 నుంచి 2019 వరకు వినియోగించుకున్న విద్యుత్‌పై నేడు రూ.3699 కోట్ల భారం ప్రజలపై మోపడం అమానుషమన్నారు. దీన్ని రద్దు చేసి ప్రభుత్వమే ఈ ఖర్చు భరించాలన్నారు. ఇప్పటికే వసూలు చేసిన ట్రూ అప్‌ చార్జీలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని, ట్రూ అప్‌ కాదు ట్రూ డౌన్‌  చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ భారానికి తోడు 2019-20, 2020-21 సంవత్సరాల ట్రూ అప్‌ చార్జీల భారం కూడా మోపడానికి ప్రభుత్వం సిద్ధమౌవుతోందని, మరోవైపు ట్రాన్స్‌కో ట్రూ అప్‌ చార్జీల ప్రతిపాధనలు కూడా సిద్ధమయ్యాయన్నారు. ప్రస్తుతం బొ గ్గు సంక్షోభం పేరుతో అధిక రేట్లు పెట్టి విద్యుత్‌ కొనుగోలు చేసి, భవిష్యత్తులో ఈ భారాన్ని ప్రజలపై మోపే ప్రమాదం పొంచి ఉందన్నారు. ఏ వస్తువుకు, సర్వీసుకు గతంలో వినియోగించుకున్న వాటికి తదుపరి సంవత్సరాల తరువాత అదనపు చార్జీలు విధించే పద్ధ తి లేదని, రాష్ట్రంలో గతంలో వినియోగించుకున్న వి ద్యుత్‌కి ట్రూ అప్‌ చార్జీలు విధించడం అన్యాయమని వెల్లడించారు. ఎన్నికల ముందు సీఎం జగన్‌ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తామని మాట ఇచ్చారని, 200 యూనిట్లు వినియోగించే అన్నివర్గాలకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని హామీఇచ్చారని, ఇప్పుడు  భిన్నంగా ట్రూ అప్‌ చార్జీలు, తదితర రూపాల్లో భారాలు మోపడం మోసపూరిత చర్యని వివరించారు. 25ఏళ్లు అనుభవంలో ప్రైవేటీకరణ ప్రోత్సహించే ఈ విద్యుత్‌ సంస్కరణలు పూర్తిగా విఫలమయ్యాయని, అందువల్ల ఈ విధానాలు మారాలని, భారాలు తగ్గి, రెగ్యులేటరీ కమిషన్‌ పున:పరిశీల న చేసి ఈ చార్జీలను రద్దు చేయాలని, లేనిపక్షంలో ప్రజాందోళన తీవ్రమవుతుందని హెచ్చరించారు. 

Updated Date - 2021-10-20T06:12:40+05:30 IST