విద్యార్థుల హాజరు యాప్‌లో నమోదు చేయండి

ABN , First Publish Date - 2021-02-27T04:56:04+05:30 IST

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల హాజరును ప్రతిరోజు యాప్‌లో నమోదు చేయాలని డిప్యూటీ డీఈవో వరలక్ష్మి పేర్కొన్నా రు.

విద్యార్థుల హాజరు యాప్‌లో నమోదు చేయండి

ప్రొద్దుటూరు టౌన్‌, ఫిబ్రవరి 26: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థుల హాజరును ప్రతిరోజు యాప్‌లో నమోదు చేయాలని డిప్యూటీ డీఈవో వరలక్ష్మి పేర్కొన్నా రు. శుక్రవారం డివిజన్‌ స్థాయిలో సీఆర్‌పీలు, ఎంఐఎస్‌, డేటా ఎంట్రీలకు వైవీఎస్‌ మున్సిపల్‌ గర్ల్స్‌ హైస్కూలులో జరిగిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠశాలల హెడ్మాస్టర్లు విద్యార్థుల హాజరును యాప్‌లో నమోదు చేయాలని అలా పంపని ప్రభుత్వ పాఠశాలలకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తామని, ప్రైవే టు పాఠశాలలవారికి అనుమతులు రద్దు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఐఎంఎంఎస్‌ యాప్‌, విద్యార్థుల అటెండెన్స్‌ యాప్‌ తదితర అంశాల గురించి వివరించారు.  కార్యక్రమంలో బ్రహ్మనందరెడ్డి, జ్వాలాపతి, మహమ్మద్‌రఫి, దొరసానిపల్లె హెడ్మాస్టర్‌ కొండారెడ్డి, సీఆర్‌పీలు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T04:56:04+05:30 IST