వరి వర్షార్పణం

ABN , First Publish Date - 2021-11-06T05:12:57+05:30 IST

వరి వర్షార్పణం

వరి వర్షార్పణం
పోరుమామిళ్లలో వర్షంధాటికి నేల కొరిగిన వరి

 1500 ఎకరాల్లో పంట నష్టం

భారీగా నష్టపోయిన రైతులు 

ప్రాథమిక అంచనాల్లో అధికారులు 

బద్వేలు, నవంబరు5: భారీ వర్షా లు బద్వేలు ప్రాంత రైతులను ని లువునా ముంచేశాయి. చేతికందివస్తున్న వరిపంట వర్షం నీటిలో ము నిగిపోయింది. వరి, ఉల్లి, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో కొన్ని చోట్ల పండిన పంట, మరి కొద్దివారాల్లో చేతికందే పంట నీటి పాలైంది. అక్కడక్కడా భూమికోతకు గురై పంట నష్టం జరిగింది.  

1500 ఎకరాల్లో పంటనష్టం

 నియోజకవర్గంలోని బద్వేలు, అట్లూరు మం డలాలు మినహా భారీవర్షాలకు పంట నష్టం తీవ్రంగా జరిగింది. వ్యవసాయాధికారుల ప్రాథమిక అంచనా ప్రకారమే 1500 ఎకరాల్లో సుమారు రూ.3 నుంచి 4 కో ట్ల వరకు పంట నష్టం జరిగింది. ఇప్పటివరకు కురిసిన వర్షాలకు పోరుమామిళ్ల, కలసపాడు, బి.కోడూరు, గోపవరం మండలాల్లో వ రి, మినుము, మొక్కజొన్న, ఉల్లి పంట నష్టం జరిగింది. ఇప్పటికీ వర్షాలు కురుస్తుండడంతో మిగిలిన పంట చేతికందే పరిస్థితి లేదని, వర్షాలు ఇలాగే కొనసాగితే మరింత పంట నష్టపోయే ప్రమాదముందని రైతన్న ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం పరిహారం అందించకపోతే రైతు లు కోలుకోవడం కష్టంగా మారుతుంది.

Updated Date - 2021-11-06T05:12:57+05:30 IST