ధాన్యం మద్దతు ధరకు కృషి చేయాలి : జేసీ

ABN , First Publish Date - 2021-05-06T04:52:48+05:30 IST

రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు.

ధాన్యం మద్దతు ధరకు కృషి చేయాలి : జేసీ
సమావేశంలో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ గౌతమి

కడప (కలెక్టరేట్‌), మే 5:  రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి అధ్యక్షతన జాయింట్‌ డైరెక్టర్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి, డీఎం, సివిల్‌ సప్లయ్‌, రవాణా శాఖ తదితర అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర అందించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. అలాగే ధాన్యం కొనుగోలు కూడా వేగవంతం చేయాలన్నారు. ప్రతి రైతు భరోసా కేంద్రంలో ఒక సహాయకుడిని నియమించాలని డీసీఎంఎస్‌  మేనేజరును ఆదేశించారు. ధాన్యం కొనుగోలు నిమిత్తం సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జిల్లా కాల్‌ సెంటరులో 18004255426 లేదా 08562- 244437 కు తెలియపరచాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యం మిల్లర్లకు పంపేందుకు తగినన్ని రవాణా వాహనాలను సమకూర్చాలని మిల్లర్లను, రవాణా కాంట్రాక్టర్లను ఆదేశించారు. నాణ్యణా ప్రమాణాల మేరకు ప్రభుత్వ మద్దతు ఽధర ఉంటుందన్నారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు జిల్లా రైస్‌ మిల్లర్లు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-06T04:52:48+05:30 IST