మళ్లీ ముంచుతున్న వానలు

ABN , First Publish Date - 2021-11-29T05:15:51+05:30 IST

ప్రకృతి అన్నదాతపై పగబట్టినట్లుంది. ప్రస్తుతం వరుస తుఫాన్లు వరదలతో పంటలు నీటమునిగి వ్యవసా యరంగం అతలాకుతలమైంది.

మళ్లీ ముంచుతున్న వానలు
జమ్మలమడుగులో వర్షపునీటిలో మునిగిన శనగపంట

 పంట పొలాల్లో భారీగా నిలిచిన వరదనీరు  రైతన్నలకు కోలుకోలేని దెబ్బ  ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు

జమ్మలమడుగు రూరల్‌, నవంబరు 28: ప్రకృతి అన్నదాతపై పగబట్టినట్లుంది.  ప్రస్తుతం వరుస తుఫాన్లు వరదలతో పంటలు నీటమునిగి వ్యవసా యరంగం అతలాకుతలమైంది.  సుమారు వారం రోజులపాటు తుఫాను కారణంగా భారీవర్షాలు కురిశాయి. దీంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో వర్షపునీటితో రైతులు, ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుడ్డారు. తిరిగి వర్షాలు తగ్గాయి అని కాస్త ఊపిరిపీల్చుకునేలోపే తుఫాను కారణంగా ఆదివారం ఉదయం నుంచి ఎడతెరపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పొలాల్లో నీరు చేరి  పంటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆందోళ నలో పడా పనులు లేక పేదలు, చేనేత కార్మికులు పస్తులుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పం దించి ఈ క్లిష్ట సమయంలో అన్ని విధాల ఆదుకోవాలని అన్ని వర్గాల ప్రజలు కోరుతున్నారు.

 సాగు చేసిన పంటల్లో గింజలు చేతికి రావు

వరుస తుఫాన్లతో జమ్మలమడుగు నియోజకవర్గం లో అన్ని ప్రాంతాల్లో  పొలాల్లో నీరుచేరి సాగు చేసిన పంటలు వర్షపునీటిలో మునిగాయి. రైతులు అప్పులు చేసి పంటు సాగు చేస్తే చేతికి గింజలు కూడా వచ్చే పరిస్థితి కనిపించడంలేదని వాపోతు న్నారు.  అన్ని పంటలకు  తీవ్ర నష్టం వాటిల్లిందని  రైతన్నలంటున్నారు. 

పెన్నానదిలోకి ఎవరు వెళ్లకూడదు

జమ్మలమడుగు పెన్నానది పరిసర ప్రాంతాల్లోకి ప్రజలు ఎవరూ వెళ్లకూడదని అధికారులు ఆదివా రం అప్రమత్తం చేశారు. 

పెన్నా పరిసర ప్రాం తాల్లో ఇప్పటికే నష్టపోయిన బాధితులు జాగ్రత్తగా ఉండాలన్నారు. మైలవరం జలాశయానికి ఇన్‌ఫ్లో పెరిగిందని, పెన్నానదికి సుమారు 25 వేల క్యూసెక్కుల వరదనీరు విడుదల చేస్తున్నట్లు సంబంధిత అధికారులు అప్రమత్తం చేశారు. 

ఈ వార్తకు ఫోటో నెట్‌లో పంపడమైనది

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ప్రొద్దుటూరు క్రైం, నవంబరు 28 : మళ్లీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పెన్నాకు ఎక్కువగా వచ్చి చేరుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వన్‌టౌన్‌ సీఐ ఎన్‌వీ నాగరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఐ  తమ సిబ్బందితో ఆదివారం ఆర్టీపీపీ రోడ్డులోని పెన్నానది తీర పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు. ఇప్పటివరకైతే ఉన్న నీళ్లే ఉన్నాయని, అతి భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలియజేస్తున్న క్రమంలో పెన్నాకు నీరు ఎక్కువగా వచ్చే ప్రమాదముందన్నారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

కొండాపురం, నవంబరు 28: మండలంలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురు స్తోంది. దీనితో పలు వాగులు, వంకలు పొంగి ప్రవ హిస్తున్నాయి. మండలంలోని పెన్నా, చిత్రావతి నదు ల్లోకి వాగులు, వంకల్లోని నీరు వచ్చి చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. 

అన్నదాతను వీడని వర్షాలు

ప్రొద్దుటూరు రూరల్‌, నవంబరు 28 : భారీ వర్షాలు వరదలు అన్నదాతను వీడడంలేదు.  పది రోజుల క్రితం కురిసిన వర్షంధాటికి తీవ్రంగా దెబ్బతిన్న రైతన్నను ఆదివారంతో మొదలైన తుఫాను మరింతగా దెబ్బతీసింది.  కొన్నిచోట్ల కూలీలతో వరి కోయించి ఆరబెడుతున్నారు. అయితే ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కురిసిన వర్షానికి కోసిన వరి మళ్లీ వర్షం నీటితో తడిసిపోయింది. దీంతో రైతన్నలు మరింతగా నష్టపోయారు. మండలంలోని చౌడూరు, పెద్దశెట్టి, శంకరాపురం, కామనూరు, నాగాయపల్లె, కానపల్లె, ఉప్పరపల్లె, తాళ్లమాపురం, సగిలిగుడ్డుపల్లె, కల్లూరు గ్రామాల్లో వరిపంట వర్షం నీటిలో పూర్తిగా మునిగిపోయింది. బొల్లవరం, పెద్దశెట్టిపల్లె గ్రామాల పరిదిలో మినుము, శనగ పంటల్లో నీరు నిలిచి పూర్తిగా దెబ్బతిన్నాయి. తుఫాను ఆగకుండా రావడంతో రైతన్నపై ఈ ఏడాది దెబ్బమీద దెబ్బపడింది. కేసీ ఆయకట్టు పరిధిలోని రైతులే కాక మెట్టప్రాంత రైతులు కూడా వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు. మండల వ్యవసాయాధికారి శివశంకర్‌రెడ్డి పంట నష్టంపై ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే మండలంలో 6,200 ఎకరాల్లో వరి పంట, 800 ఎకరాల్లో మినుము, 420 ఎకరాల్లో శనగ పంట దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. మరిన్ని రోజులు వర్షసూచన ఉందన్న సమాచారంతో రైతులు మరింత ఆం దోళన చెందుతున్నార. ఈ ఏడాది పంట వచ్చినా కూడా చేతికొచ్చే అవకాశాలు లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.Updated Date - 2021-11-29T05:15:51+05:30 IST