సర్పంచ్‌ల సమస్యలు పరిష్కరించాలని వినతి
ABN , First Publish Date - 2021-12-31T05:56:33+05:30 IST
సమస్యలు పరిష్కరించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్‌ను సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు.
తాడేపల్లిటౌన్, డిసెంబరు 30: సమస్యలు పరిష్కరించాలని పంచాయతీరాజ్ కమిషనర్ కోన శశిధర్‌ను సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు చిలకలపూడి పాపారావు కోరారు. ఈ మేరకు తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యాలయంలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ సర్పంచ్‌లకు తెలియకుండా 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులు తీసుకున్నవాటిని తిరిగి పంచాయతీ అకౌంట్లలో జమచేయాలన్నారు. సీఎంఎఫ్‌ఎస్ నుంచి పంచాయతీలను మినహాయించాలని, గౌరవ వేతనాన్ని క్రమంతప్పకుండా విడుదల చేయాలని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.32 కోట్లను జమ చేయాలని కోరారు. సమస్యలను మంత్రి పెద్దిరెడ్డితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోన శశిధర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు కృష్ణమోహన్, ఎం మనోహర్, నరసింహారావు, ఉషారాణి, నాగమణి, శ్రీనివాసరావు, సీతారామిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.