ఏఎనయూకు అంతర్జాతీయ ర్యాంకు

ABN , First Publish Date - 2021-11-03T05:08:38+05:30 IST

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో లండన్‌కు చెందిన క్యూఎస్‌ సంస్థ 2022 సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకుల్లో ఆసియా స్థాయిలో 501-550వ ర్యాంకులను దక్కించుకుంది.

ఏఎనయూకు అంతర్జాతీయ ర్యాంకు

పెదకాకాని, నవంబరు 2: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్జాతీయ స్థాయిలో లండన్‌కు చెందిన క్యూఎస్‌ సంస్థ 2022 సంవత్సరానికి ప్రకటించిన ర్యాంకుల్లో ఆసియా స్థాయిలో 501-550వ ర్యాంకులను దక్కించుకుంది. విద్య, భోధన, పరిశోధన పత్రాలు, సైటేషన్స్‌, ఆవిష్కరణలు, అంతర్జాతీయ దృక్పధం, తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను సాధించినట్లు ర్యాంకుల సమన్వయకర్త భవనం నాగకిషోర్‌ మంగళవారం తెలిపారు. యూనివర్సిటీ వీసీ రాజశేఖర్‌ మాట్లాడుతూ సమష్టి కృషితోనే ర్యాంకుల సాధ్యమన్నారు. విశ్వవిద్యాలయ రెక్టార్‌ వరప్రసాదమూర్తి, రిజిస్ర్టార్‌ కరుణ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.


Updated Date - 2021-11-03T05:08:38+05:30 IST