హెచ్‌ఎంలకు షోకాజ్‌లు సరికాదు: ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2021-12-09T05:46:34+05:30 IST

జిల్లాలో నాడు నేడు ఫేజ్‌ -1 కింద పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఆర్వోపాంట్లు 468పనిచేయడం లేదని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం శోచనీయమని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు ఆందోళన వ్యక్తం చేశారు.

హెచ్‌ఎంలకు షోకాజ్‌లు సరికాదు: ఏపీటీఎఫ్‌
ఆర్‌జేడీ ఎస్వీ సుబ్బారావుకు వినతిపత్రం అందజేస్తున్న ఏపీటీఎప్‌ నాయకులు

గుంటూరు(విద్య), డిసెంబరు 8: జిల్లాలో నాడు నేడు ఫేజ్‌ -1 కింద పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ఆర్వోపాంట్లు 468పనిచేయడం లేదని ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం శోచనీయమని ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కె.బసవలింగారావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్లాంటు ఏర్పాటు చేసిన ఏజన్సీలు సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తున్నాయి. ఎన్నిసార్లు సాంకేతిక సిబ్బందికి  విజ్ఞప్తిచేసినా ఫలితం లేదని పేర్కొన్నారు. ఇందుకు ప్రధానోపాధ్యాయులను బాఽధ్యులుగా చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు పి.నాగశివన్నారాయణ, రాష్ట్ర కౌన్సిలర్‌ మహమ్మద్‌ ఖలీద్‌, బి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T05:46:34+05:30 IST