గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు దుర్మరణం

ABN , First Publish Date - 2021-03-24T13:10:07+05:30 IST

సత్తెనపల్లిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి ధూళ్లిపాళ్ళకు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది...

గుంటూరులో ఘోర రోడ్డుప్రమాదం..ముగ్గురు దుర్మరణం

గుంటూరు: సత్తెనపల్లిలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి ధూళ్లిపాళ్ళకు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన సత్తెనపల్లిలోని ఐదులాంతర్ల సెంటర్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Updated Date - 2021-03-24T13:10:07+05:30 IST