పోలింగ్‌ కేంద్రం మారిస్తే ఎన్నికల బహిష్కరణ

ABN , First Publish Date - 2021-02-06T09:54:57+05:30 IST

తమ పంచాయతీలో కాకుండా వేరేచోట పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే ఎన్నికలను బహిష్కరిస్తామని విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు, ప్రజలు స్పష్టం చేశారు.

పోలింగ్‌ కేంద్రం మారిస్తే ఎన్నికల బహిష్కరణ

సీలేరు (విశాఖ జిల్లా), ఫిబ్రవరి 5: తమ పంచాయతీలో కాకుండా వేరేచోట పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే ఎన్నికలను బహిష్కరిస్తామని విశాఖ ఏజెన్సీలోని గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీలోని అన్ని రాజకీయ పక్షాల నాయకులు, ప్రజలు స్పష్టం చేశారు. ఈ మండలంలోని గుమ్మిరేవుల పోలింగ్‌ కేంద్రాన్ని ధారకొండలో, గాలికొండ, అమ్మవారిధారకొండ పంచాయతీల పోలింగ్‌ కేంద్రాలను సప్పర్లలో ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. తమ పంచాయతీ పరిధిలోని పరమశింగవరం, కొండజర్త గ్రామాల వారు పది కిలోమీటర్ల మేర కొండలు, గుట్టలు దాటుకుంటూ పంచాయతీ కేంద్రానికి రావాల్సి ఉంటుందని, మళ్లీ ఇక్కడ నుంచి 22 కిలోమీటర్ల దూరంలో వున్న ధారకొండ వెళ్లి ఓటు వేయాలంటే కష్టసాధ్యమని అఖిలపక్ష నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-02-06T09:54:57+05:30 IST