పంట నష్టపరిహారం సత్వరం అందించాలి

ABN , First Publish Date - 2021-11-21T06:49:22+05:30 IST

అకాల వర్షాలకు వరి పంట దెబ్బతిందని, పంట నష్టపరిహారం వెంటనే అందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు డిమాండ్‌ చేశారు.

పంట నష్టపరిహారం సత్వరం అందించాలి

ఆత్రేయపురం, నవంబరు 20: అకాల వర్షాలకు వరి పంట దెబ్బతిందని, పంట నష్టపరిహారం వెంటనే అందించాలని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు డిమాండ్‌ చేశారు. శనివారం  వద్దిపర్రు, వెలిచేరు, ఉచ్చిలి, పులిదిండి తదితర గ్రామాల్లో దెబ్బతిన్న వరి పంట పొలాలను ఆయన పరిశీలించి, నష్ట వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు, తోటకూర సుబ్బరాజు, పల్లికొండ వజ్రకుమార్‌, జుజ్జవరపు హరిబాబు, తోట రజని, రవిచంద్ర, కరుటూరి వరప్రసాద్‌, కనుమూరి బాబు, చిటికెన సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. Updated Date - 2021-11-21T06:49:22+05:30 IST