కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

ABN , First Publish Date - 2021-05-08T06:18:38+05:30 IST

కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రంలో మోది సర్కార్‌, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందాయని ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు విమర్శించారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

రాజానగరం, మే 7: కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో కేంద్రంలో మోది సర్కార్‌, రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందాయని ఏఐకెఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనిపల్లి సత్తిబాబు విమర్శించారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) ఆధ్వర్యంలో నందరాడలోని అల్లూరి సీతారామరాజు విగ్రహా నికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అల్లూరికి విప్లవ జోహార్లు, సామ్రాజ్యవాదం నశించాలంటూ నినాదాలు చేశారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్‌ నాయకులు కడియాల దుర్గారావు, గుత్తుల అప్పారావు, వల్లూరి వెంకన్న, టేకూకూడి కృష్ణ, రాజా పాల్గొన్నారు.

Updated Date - 2021-05-08T06:18:38+05:30 IST