అర్జున అవార్డు అందుకున్న సాత్విక్
ABN , First Publish Date - 2021-11-02T07:11:46+05:30 IST
అమలాపురం టౌన్, నవంబరు 1: అమలాపురం పట్టణానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడా కారుడు రంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్ సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అర్జున అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ హోటల్ సెంట్ర ల్ హాలులో జరిగిన కార్యక్రమంలో
అమలాపురం టౌన్, నవంబరు 1: అమలాపురం పట్టణానికి చెందిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడా కారుడు రంకిరెడ్డి సాత్విక్‌సాయిరాజ్ సోమవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అర్జున అవార్డును అందుకున్నారు. న్యూఢిల్లీలోని అశోక్ హోటల్ సెంట్ర ల్ హాలులో జరిగిన కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ చేతులమీదుగా సాత్వి క్ అర్జున అవార్డును అందుకున్నారు. సాత్విక్ వెంట తండ్రి కాశీవిశ్వనాథం ఉన్నారు. కుమారుడు సాత్విక్ అర్జున అవార్డును అందుకోవడం ఆనందంగా ఉందని తండ్రి కాశీవిశ్వనాథం ఆనందం వ్యక్తం చేశారు.