ద్వారకా తిరుమలలో అమానుషం

ABN , First Publish Date - 2021-11-25T23:14:52+05:30 IST

ద్వారకా తిరుమలలో దారుణం జరిగింది. చినవెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ...

ద్వారకా తిరుమలలో అమానుషం

ఏలూరు: ద్వారకా తిరుమలలో దారుణం జరిగింది. చినవెంకన్న శేషాచలం కొండపై మహిళా యాచకులను మోకాళ్లపై కూర్చోబెట్టి సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో కొట్టారు. దెబ్బలు తాళ్లలేక మహిళా యాచకులు కేకలు పెట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మహిళా యాచకులపై శివాలయం దగ్గర దాడి జరిగింది. అయితే భక్తులను ఇబ్బంది పెడుతున్నారనే కారణంతో ఈ ఘటన జరిగినట్టు దేవస్థానం అధికారులు సమర్థించుకున్నారు. మరోవైపు తాము వెళ్లిపోతామని చెప్పినా కనికరం చూపలేదని మహిళా యాచకులు ఆవేదన వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది తీరును తప్పుబట్టారు.

Read more