తిరుపతి: వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెనలు..30 గ్రామాలకు రాకపోకలు స్తంభన

ABN , First Publish Date - 2021-11-21T15:44:22+05:30 IST

వరద ప్రవాహానికి కేసీ పేట, తనపల్లి, తిరుచానూరు గ్రామాల సమీపంలో ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి.

తిరుపతి: వరద ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెనలు..30 గ్రామాలకు రాకపోకలు స్తంభన

తిరుపతి: స్వర్ణముఖి వరద ప్రవాహానికి కేసీ పేట, తనపల్లి, తిరుచానూరు గ్రామాల సమీపంలో ఉన్న వంతెనలు కొట్టుకుపోయాయి. తిరుచానూరు వైపు నుంచి పాడిపేట, ముండ్లపూడి, తనపల్లి, కుంట్రపాకం, వెంకటరామపురం తదితర 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరద ఉధృతి తగ్గితే గానీ... తాత్కాలిక వంతెనలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని,  కనీసం 20 రోజుల సమయం పడుతుందని అధికారులు చెప్పడంతో 30 గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వదర ముంపు ప్రాంతాల్లో బాధితులకు మంచినీరు, ఆహారం అందడంలేదు. అధికారులు, వాలంటీర్లు పట్టించుకోవడంలేదు.

Updated Date - 2021-11-21T15:44:22+05:30 IST