ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-01-13T05:09:03+05:30 IST

పట్టణంలోని బసినికొండకు చెందిన మహ్మద్‌ కుమార్తె ఎస్‌.సమీనా(13) మంగళవారం ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది.

ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
మృతిచెందిన సమీనా

మదనపల్లె క్రైం, జనవరి 12: పట్టణంలోని బసినికొండకు చెందిన మహ్మద్‌ కుమార్తె ఎస్‌.సమీనా(13) మంగళవారం ఫ్యానుకు చీరతో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబీకులు ఉరితాడు తొలగించి ఆటోలో జిల్లా వైద్యశాలకు తరలించారు. మార్గమధ్యంలో మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరణ చేశారు. కాగా మహ్మద్‌ టెంపో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు.  రెండోకుమార్తె సమీనా మానసిక స్థితి సరిగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు పోలీసులకు చెప్పారు. ఈ మేరకు కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వంశీధర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-01-13T05:09:03+05:30 IST