భూమి నుంచి వింత శబ్దాలు.. వణికిపోతున్న జనాలు!

ABN , First Publish Date - 2021-11-21T16:36:25+05:30 IST

ఇళ్లలో పనులు చేసుకుంటుంటే వస్తువులు కిందపడి పోతున్నాయని చెబుతున్నారు....

భూమి నుంచి వింత శబ్దాలు.. వణికిపోతున్న జనాలు!

చిత్తూరు జిల్లా/ఐరాల : జిల్లాలోని ఐరాల మండలం ఎర్రేపల్లె పంచాయతీ పరిధిలోని అబ్బగుండుపల్లెలో భూమి నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో గ్రామస్థులు వణికిపోతున్నారు. ఇళ్లలో పనులు చేసుకుంటుంటే వస్తువులు కిందపడి పోతున్నాయని చెబుతున్నారు. శనివారం సర్పంచ్‌ తులసీప్రసాద్‌, కార్యదర్శి ప్రమీల అబ్బగుండు పల్లెకు వెళ్లి గ్రామస్థులకు ధైర్యం చెప్పారు. అలాగే మైన్స్‌ ఏడీ ప్రకాష్‌కుమార్‌ గ్రామాన్ని సందర్శించారు. అబ్బగుండుపల్లె పరిసరాల్లో రైతులు ఎక్కువగా బోర్లు వేశారని, ఇటీవల వర్షం కురుస్తుండటంతో భూమి పొరల్లో నీరు చేరుతుండటంతో ఈ శబ్దాలు వస్తున్నట్లు చెప్పారు. ఈ కారణంగా భూకంపం రాదన్నారు.అధికంగా బోర్లు వేయవద్దని సూచించారు.

Updated Date - 2021-11-21T16:36:25+05:30 IST