పింఛా పరవళ్లు..!

ABN , First Publish Date - 2021-09-03T05:38:30+05:30 IST

: పీలేరు మండలంలోని మూడు ప్రాంతాల్లో పింఛా ఏరు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది.

పింఛా పరవళ్లు..!
ఆకులవారిపల్లె వద్ద రోడ్డుపై పరవళ్లు తొక్కుతున్న పింఛా ఏరు

పీలేరు, సెప్టెంబరు 2: పీలేరు మండలంలోని మూడు ప్రాంతాల్లో పింఛా ఏరు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. గురువారం వేకువజామున కురిసిన కుండపోత వర్షానికి బాలంవారిపల్లె గార్గేయ రిజర్వాయర్‌ నిండి మొరవ పోతుండడంతో పింఛా ఏరు సాగుతోంది. సదుం మార్గంలోని నూనేవాండ్లపల్లె బాలంవారిపల్లె రోడ్లతో పాటు ఆకులవారిపల్లె రోడ్డుపై ఏరు పరవళ్లు తొక్కుతోంది. పీలేరు మం డలంలో గురువారం 56 మి.మీ వర్షపాతం నమోదైంది. అంతకు ముందే గార్గేయ రిజర్వాయర్‌ దాదాపుగా నిండి ఉండడంతో మొరవ పోయింది. దీంతో రోడ్లపై నీరు ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్తగా పోలీసులు సదుం మార్గంలోని బాలంవారిపల్లె వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పోలీసులు పహారా పెట్టారు. రాత్రి వేళ ఈ మార్గంలో వాహనాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. కాగా మండలంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ చెరువులు, కుంటల్లో నీరు చేరాయి.Updated Date - 2021-09-03T05:38:30+05:30 IST