‘ఒమెక్స్ హెల్త్‌కేర్’కు జాతీయ అవార్డు
ABN , First Publish Date - 2021-12-19T07:06:48+05:30 IST
తిరుపతికి చెందిన ఒమెక్స్ హెల్త్‌కేర్ సంస్థకు ఫార్మాస్యూటికల్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయర్’ జాతీ య అవార్డు వచ్చిందని ఎండీ బండి శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
తిరుపతి సిటీ, డిసెంబరు 18: తిరుపతికి చెందిన ఒమెక్స్ హెల్త్‌కేర్ సంస్థకు ఫార్మాస్యూటికల్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయర్’ జాతీ య అవార్డు వచ్చిందని ఎండీ బండి శేఖర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్ సమయంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే విటమిన్-సి, జింక్, విటమిన్ డీ-3 మాత్రలను తమ సంస్థ ఎఫర్వేసెంట్ రూపంలో ఆవిష్కరించిందన్నారు. ఇవి మారుతున్న వేరియంట్లను తట్టుకునేలా చక్కటి ఫలితాలు వచ్చాయన్నారు. ఆ తర్వాత దేశంలోనే మరోసారి ప్రప్రథమంగా కొలోస్ట్రమ్, విటమిన్-సి, జింక్, డీ-3 (చూవబుల్ ప్లస్) మాత్రలను ఆవిష్కరించి కొవిడ్ నియంత్రణలో భాగస్వామ్యం అయినందుకు తమ సంస్థకు ఎంఎ్‌సఎంఈ ఇండియా బిజినెస్ అవార్డ్స్ వారు జాతీయ స్థాయిలో బెస్ట్ ఎంటర్‌ప్రైజ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆయన పేర్కొన్నారు.ఈఅవార్డును శనివారం వర్చువల్ విధానంలో తనకు అందజేసినట్లు శేఖర్ పేర్కొన్నారు.తమసంస్థ ఇలాంటిఅవార్డుకు ఎంపికవడానికి సహకరించిన వైద్యులకు, కెమి్‌స్టలకు కృతజ్ఞతలు తెలియజేశారు.