మ్యూజియాన్ని పరిశీలించిన జేఈవో

ABN , First Publish Date - 2021-03-24T07:17:38+05:30 IST

గోవిందరాజస్వామి మాడవీధిలోని టీటీడీ మ్యూజియాన్ని మంగళవారం జేఈవో సదా భార్గవి పరిశీలించారు.

మ్యూజియాన్ని పరిశీలించిన జేఈవో
వివరాలు తెలుసుకుంటున్న సదా భార్గవి

తిరుపతి, మార్చి 23  (ఆంధ్రజ్యోతి): గోవిందరాజస్వామి మాడవీధిలోని టీటీడీ మ్యూజియాన్ని మంగళవారం జేఈవో సదా భార్గవి పరిశీలించారు. తిరుమల మ్యూజియం తరహాలోనే దీన్నీ తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. మ్యూజియంలో విలువైన కళాఖండాలున్నా.. సరైన రీతిలో ప్రదర్శించే ఏర్పాటు చేయకపోవడం తగదన్నారు. మ్యూజియం మధ్యలో ఉన్న కొలనులో నీరు పాచిపట్టిపోవటాన్ని చూసి, వెంటనే శుభ్రం చేయాలని చెప్పారు. నమ్మాళ్వార్‌ మండపంలో తిరుమల శ్రీవారి చరిత్రకు సంబంధించిన గ్యాలరీ అద్భుతంగా ఉందన్నారు. అలాగే కార్యాలయంలోని అపురూపమైన గ్రంథాలను పరిశీలించారు. తాళ్లపాక అన్నమయ్య రాగిరేకులను చూసే అవకాశం ఉన్న మ్యూజియం అనే విషయాన్ని ప్రచారం చేయాలని సూచించారు. 

Updated Date - 2021-03-24T07:17:38+05:30 IST