3నుంచి డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2021-12-30T07:12:57+05:30 IST

ఎస్వీయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్నారు.

3నుంచి డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు

తిరుపతి (విశ్వవిద్యాలయాలు), డిసెంబరు 29: ఎస్వీయూ డిగ్రీ ఇన్‌స్టంట్‌ పరీక్షలు జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్నారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్‌ కాలేజీ, మదనపల్లె బీటీ కాలేజీ, చిత్తూరు పీవీకేఎన్‌ కాలేజీల్లో పరీక్షలు జరుగుతాయి. ఉదయం ఐదో సెమిస్టర్‌, మధ్యాహ్నం ఆరో సెమిస్టర్‌ పరీక్షలు ఉంటాయి. ఈ మేరకు సీఈ దామ్లా నాయక్‌ తెలిపారు. కాగా.. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ నాల్గవ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను విడుదల చేశామని పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-30T07:12:57+05:30 IST