బొకేలు తేవద్దు : కలెక్టర్‌

ABN , First Publish Date - 2021-12-31T05:40:42+05:30 IST

ఒమైక్రాన్‌ వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలకు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఈ సారి కొంత దూరంగా ఉండాలని నిర్ణయించారు.

బొకేలు తేవద్దు  : కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 30: ఒమైక్రాన్‌ వ్యాప్తి నియంత్రణ లక్ష్యంగా నూతన ఆంగ్ల సంవత్సర వేడుకలకు కలెక్టర్‌ హరినారాయణన్‌ ఈ సారి కొంత దూరంగా ఉండాలని నిర్ణయించారు. జనవరి ఫస్ట్‌ సందర్భంగా శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మాత్రమే వ్యక్తిగతంగా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, శ్రేయోభిలాషులు, ప్రజలు కలెక్టర్‌ను భౌతిక దూరం పాటిస్తూ కలెక్టరేట్‌లో కలుస్తారని అధికార వర్గాలు తెలిపాయి. కలెక్టరేట్‌కు తప్ప క్యాంపు కార్యాలయానికి ఎవరూ రావద్దని పేర్కొన్నారు. వచ్చే వారిని కలెక్టర్‌ నిర్ణీత గంట వ్యవధిలో మాత్రమే కలుస్తారని, ఆ సమయంలో పుష్పగుచ్ఛాలు, స్వీటు బాక్సులు, పండ్ల బుట్టలు వంటివి ఇచ్చేందుకు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులకు వాట్సాప్‌ ద్వారా సందేశాలను పంపారు.

Updated Date - 2021-12-31T05:40:42+05:30 IST