శ్వేతపద్మకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం
ABN , First Publish Date - 2021-12-31T07:56:48+05:30 IST
తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ సాహిత్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ శ్వేతపద్మ శతపథికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
తిరుపతి(విద్య), డిసెంబరు 30: తిరుపతిలోని జాతీయ సంస్కృత యూనివర్సిటీ సాహిత్య విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ శ్వేతపద్మ శతపథికి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఢిల్లీలోని కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డులను గురువారం ప్రకటించింది. ఈమె సంస్కృతంలో రచించిన కథా కల్పలత (షార్ట్ స్టోరీస్) అనే పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించారు. ఈమె తండ్రి హరేకృష్ణ శతపథి గతంలో సంస్కృత వర్సిటీ వీసీగా పనిచేశాను.