‘నాసెన భూములు రైతులకు అప్పగించాలి’

ABN , First Publish Date - 2021-08-03T06:10:40+05:30 IST

సోమందేపల్లి మండలంలో నాసెన కంపెనీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తక్షణమే ఇవ్వాలని, సదరు భూముల్లో వ్యవసాయ పనులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.

‘నాసెన భూములు రైతులకు అప్పగించాలి’

పెనుకొండ, ఆగస్టు 2: సోమందేపల్లి మండలంలో నాసెన కంపెనీకి భూములు ఇచ్చిన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ తక్షణమే ఇవ్వాలని, సదరు భూముల్లో వ్యవసాయ పనులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, భూహక్కుల పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షులు సీఆర్‌రెడ్డి, కార్యదర్శి నాగరాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్‌, సోమందేపల్లి సీపీఎం నాయకులు రాజగోపాల్‌, హనుమయ్య ఆధ్వర్యంలో రైతులు సబ్‌ కలెక్టర్‌కు వినతిని అందించారు. కార్యక్రమంలో నాయకులు రాజగోపాల్‌, హనుమయ్య, వెంకటేశ, లింగారెడ్డి, కేవీపీఎస్‌ నాయకులు గోపాల్‌, గణేష్‌, వెంకటేశ, శంకర్‌రెడ్డి, చిట్టమ్మ, మణి, నాగమణి, తిప్పన్న పాల్గొన్నారు.  అదేవిధంగా చిలమత్తూరు మండలం దేమకేతేపల్లి పంచాయతీలో పనిచేస్తున్న స్వచ్చభారత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న జీతాలను వెంటనే చెల్లించాలని సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. 


Updated Date - 2021-08-03T06:10:40+05:30 IST