సచివాలయాల్లో వంద శాతం బయోమెట్రిక్‌ నమోదవ్వాలి

ABN , First Publish Date - 2021-09-03T06:25:33+05:30 IST

గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు వందశాతం నమోదవ్వాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను ఆదేశించారు.

సచివాలయాల్లో వంద శాతం  బయోమెట్రిక్‌ నమోదవ్వాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన

అనంతపురం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా బయోమెట్రిక్‌ హాజరు వందశాతం నమోదవ్వాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సెల్వరాజన.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టర్‌ తన క్యాంపు కార్యాలయంలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ... గ్రామ, వార్డు సచివాలయాల్లో బయోమెట్రిక్‌ హాజరు వంద శాతం నమోదుకావడంతోపాటు వలంటీర్ల బయోమెట్రిక్‌ హాజరు శాతం గణనీయంగా పెంచాలన్నారు. ఏ కార్యాలయంలోనైనా సిబ్బంది హాజరు నమోదు ప్రాథమిక చర్యల్లో ఒకటన్నారు. సచివాలయాల పనితీరు మెరుగు పరిచేందుకు ఉన్నతాధికారులు వారి పరిధిలోని సచివాలయాలను ఎప్పటికప్పుడు సందర్శించాలన్నారు. మారుమూల ప్రాంతాల్లోని సచివాలయాలను సందర్శించేందుకు తాను వారంలో ఒకటి రెండురోజులు కేటాయిస్తున్నానన్నారు. అధికారులు కూడా పెండింగ్‌లో ఉన్న సేవలు, స్పందన సమస్యల పరిష్కారంపై రోజువారీగా పర్యవేక్షిస్తూనే సచివాలయాల పనితీరు మెరుగుపరచాలన్నారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ సిరి, మున్సిపల్‌ ఆర్డీ నాగరాజు, అనంతపురం నగర కమిషనర్‌ మూర్తి, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-09-03T06:25:33+05:30 IST