వైసీపీపై అడబాల శ్రీను అసంతృప్తి

ABN , First Publish Date - 2021-11-25T23:15:12+05:30 IST

వైసీపీపై ఆకివీడు పార్టీ సీనియర్‌ నేత అడబాల శ్రీను అసంతృప్తి చేశారు. పార్టీలో జెండా మోసిన కార్యకర్తలను గాలికొదిలేసి.. నాయకులు పదవుల కోసం

వైసీపీపై అడబాల శ్రీను అసంతృప్తి

ఏలూరు: వైసీపీపై ఆకివీడు పార్టీ సీనియర్‌ నేత అడబాల శ్రీను అసంతృప్తి చేశారు. పార్టీలో జెండా మోసిన కార్యకర్తలను గాలికొదిలేసి.. నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నారని అడబాల శ్రీను ఆరోపించారు. అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాలు కార్యకర్తలకు అందటం లేదని విమర్శించారు. అంతా వాలంటీర్లే అంటున్నారని, ఎన్నికలు కూడా వారితోనే చేయించుకోవాలన్నారు. ఆకివీడు నగర పంచాయతీ వైసీపీ గెలిచిందని సంబరపడుతున్నారని, డబ్బులు ఎక్కువే ఇచ్చాం గనుకే గెలిచామని, లేకపోతే మనం ఓడిపోయే వాళ్లమని అడబాల శ్రీను తెలిపారు.

Read more