మద్యం షాపుల ముందు తగ్గిన హడావిడి

ABN , First Publish Date - 2020-05-17T22:35:53+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 50 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంచడంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మద్యం షాపుల ముందు తగ్గిన హడావిడి

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు 50 రోజుల పాటు మద్యం దుకాణాలను మూసి ఉంచడంతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజూ మద్యం తాగేవారైతే మందు లేక విలవిల్లాడిపోయారు.కొందరైతే మానసిక అనారోగ్యానికి గురైపిచ్చాసు పత్రుల్లోచేరారు. లాక్‌డౌన్‌ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా లేకుండా పోవడంతో ఎట్టకేలకు మద్యం దుకాణాలను తెరిచేందుకు అనుమతించారు.మద్యందుకాణాలు తెరిచిన మొదటి రోజున కిలోమీటర్ల మేరకు బారులు తీరిన మందు బాబులు ఎగబడి మద్యం కొన్నారు. కాగా రెండో రోజూ దాదాపు అదే పరిస్థితి నెలకొంది. మూడు రోజుల తర్వాత మద్యం దుకాణాల్లో కొనుగోలు దారులు పలుచబడ్డారు. ప్రస్తుతం ఏ మద్యం దుకాణాల వద్ద కూడా అసలు జనాలు కనిపించడం లేదు. అప్పుడొకరు, ఇప్పుడొకరు వచ్చి కొనుగోలుచేస్తున్నారు. దీనికి కారణం ప్రభుత్వం ఏ వర్గాన్ని టార్గెట్‌ చేసుకుని మద్యం దుకాణాలనుతెరిచిందో ప్రస్తుతం కొనుగోలు తగ్గించారు. దీనికి కారణం లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి లేకపోవడం, జీతాలు రాక పోవడం వల్ల చాలా మంది మద్యం ప్రియులు మందు తాగాలనుకున్నా చే తిలో డబ్బులు లేక మిన్నకుండిపోతున్నారు. 


దీంతో ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే మద్యం అమ్మకాలు దాదాపు 40 నుంచి 50 శాతం పడిపోయినట్టు వ్యాపారులు తెలిపారు. గ్రేటర్‌హైదరాబాద్‌ పరిధిలో దాదాపు 3500 మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా మద్యం అమ్మకాలు ప్రారంభమైన మొదటి రోజున 150 కోట్ల మేరకు అమ్మకాలు జరిగినట్టు వ్యాపారులు తెలిపారు. కానీ తర్వాత అమ్మకాలు బాగా పడిపోయినట్టు వెంకటేశ్వరరెడ్డి అనేక మద్యం వ్యాపారి అభిప్రాయపడ్డారు. చాలా మద్యం దుకాణాల్లో ప్రీమియం బ్రాండ్‌లు, ఖరీదైన మద్యం మాత్రం కొద్ది కొద్దిగా అమ్మకాలు జరుగుతున్నాయని అంటున్నారు. కానీ చీఫ్‌ లిక్కర్‌ దాదాపు 50శాతం పడిపోయినట్టు వ్యాపారులు చేతిలో డబ్డులేకనే చాలా మంది మద్యం ప్రియులు కొనుగోలు తగ్గించినట్టు తెలిసింది. దీంతో ప్రభుత్వం మద్యం అమ్మకాలు ద్వారా భారీగా ఆదాయం వస్తుందని ఆశించినా అందుకుతగ్గట్టుగా అమ్మకాలు లేవని ఎక్సైజ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. 


Updated Date - 2020-05-17T22:35:53+05:30 IST