గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ

ABN , First Publish Date - 2020-05-24T12:57:53+05:30 IST

గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ

గొర్రెకుంట మృతుల కేసులో వీడని మిస్టరీ

వరంగల్: గొర్రెకుంట మృతుల కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. కేసును సవాల్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈకేసులో ముగ్గురు అనుమానితులు పోలీసుల అదుపులో ఉన్నారు. విషప్రయోగం  కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఏడు మృతదేహాల్లో విషపు ఆనవాళ్లు లభ్యమైనట్లు సమాచారం. ఏడుగురికి విషం ఇచ్చి చంపి మిగిలిన ఇద్దరు భయంతో బావిలో దూకి చనిపోయారా? లేక మక్సూదే అందరినీ చంపేశాడా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తునకు హోం మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - 2020-05-24T12:57:53+05:30 IST