సరికొత్త వెంటిలేటర్‌ను తయారు చేసిన మాజీ ఎంపీ

ABN , First Publish Date - 2020-04-22T00:13:20+05:30 IST

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్‌ను తయారు చేశారు. దీనిని పూర్తి దేశీయ

సరికొత్త వెంటిలేటర్‌ను తయారు చేసిన మాజీ ఎంపీ

హైదరాబాద్: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా చికిత్సకు ఉపయోగపడే వెంటిలేటర్‌ను తయారు చేశారు. దీనిని పూర్తి దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. శాస్త్రసాంకేతిక రంగంలో ఇదొక గొప్ప మలుపు అన్నారు. దీనికి ఇండియన్ కోవిడ్ వెంటిలేటర్‌గా నామకరణం చేసినట్లు విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. అన్ని వెంటిలేటర్లు కోవిడ్ చికిత్సకు ఉపయోగ పడవన్నారు. ఐసీయూ వెంటిలేటర్ కరోనా చికిత్సకు పని చేస్తుంది కానీ.. దాని ధర రూ.8 లక్షల వరకు ఉంటుందన్నారు. తక్కువ ఖర్చుతోనే కోవిడ్ వెంటిలేటర్‌ను రూపొందించామన్నారు. నెలకు 300 వెంటిలేటర్లను తయారు చేస్తే సామర్థ్యం ఉందన్నారు.

Updated Date - 2020-04-22T00:13:20+05:30 IST