కరోనా కట్టడికి సీఎం చర్యలు భేష్‌: వంగపల్లి

ABN , First Publish Date - 2020-04-01T09:12:30+05:30 IST

కరోనాను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర

కరోనా కట్టడికి సీఎం చర్యలు భేష్‌: వంగపల్లి

మోటకొండూరు, మార్చి 31: కరోనాను ఎదుర్కోవడానికి సీఎం కేసీఆర్‌ తీసుకుంటున్న చర్యలు ఎంతో ఆదర్శంగా ఉన్నాయని ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్‌ మాదిగ అన్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పేదలను ఆదుకోవడానికి ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ.1500 ఆర్థికసాయం ప్రకటించడం అభినందనీయమన్నారు.

Updated Date - 2020-04-01T09:12:30+05:30 IST