రైతుల బాగు కోసమే కేంద్రం కొత్త చట్టాలు తెచ్చింది: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-12-08T00:55:47+05:30 IST

వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకే కేంద్రం కొత్త చట్టాలు తెచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులు నచ్చిన చోట నచ్చిన ధరకు అమ్ముకునే వీలుందని చెప్పారు. రైతుల పంటలను కొనుగోలు చేసే వారిలో పోటీతత్వం

రైతుల బాగు కోసమే కేంద్రం కొత్త చట్టాలు తెచ్చింది: కిషన్‌రెడ్డి

ఢిల్లీ: వ్యవసాయరంగాన్ని ఆదుకునేందుకే కేంద్రం కొత్త చట్టాలు తెచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. రైతులు తమ ఉత్పత్తులు నచ్చిన చోట నచ్చిన ధరకు అమ్ముకునే వీలుందని చెప్పారు. రైతుల పంటలను కొనుగోలు చేసే వారిలో పోటీతత్వం కోసమే కొత్త చట్టం తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు. టీఆర్‌ఎస్‌ స్వార్థ ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలను వ్యతిరేకిస్తోందని విమర్శించారు. తెలంగాణలో ప్రభుత్వమే బంద్‌లో పాల్గొనాలనడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ప్రభుత్వ బంద్‌ను తిప్పికొట్టాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

Updated Date - 2020-12-08T00:55:47+05:30 IST