రెడ్‌కోలో కాంట్రాక్ట్‌ ఇంజనీర్ల నియామకాలు

ABN , First Publish Date - 2020-07-10T09:03:52+05:30 IST

రెడ్‌కోలో కాంట్రాక్ట్‌ ఇంజనీర్ల నియామకాలు

రెడ్‌కోలో కాంట్రాక్ట్‌ ఇంజనీర్ల నియామకాలు

తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్‌ రెడ్‌కో) లో తాత్కాలిక ప్రాతిపదికన కాంట్రాక్ట్‌ ఇంజనీర్ల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. రూర్బన్‌, ఎంపీ ల్యాడ్‌, సీఎ్‌సఆర్‌ నిధులతో చేపట్టే ప్రాజెక్టుల పనులను పర్యవేక్షించడానికి వీలుగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఉన్నత నైపుణ్యాలు కలిగిన ఒకరిని ప్రాజెక్టు ఇన్‌చార్జిగా, నైపుణ్యాలు కలిగిన మరో నలుగురిని సెంట్రల్‌ కో-ఆర్డినేటర్లుగా నియమించనున్నారు. ప్రాజెక్టు ఇన్‌చార్జి పోస్టుకు దరఖాస్తు చేసేవారు ఐటీతో పాటు ఎల్‌ఈడీ ప్రాజెక్టుల్లో 12 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. ఈ పోస్టులకు ఈనెల 22వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దర ఖాస్తు చేసుకోవాలి.

Updated Date - 2020-07-10T09:03:52+05:30 IST