కాలువ కాంక్రీట్‌కు పగుళ్లు లేవు

ABN , First Publish Date - 2020-07-10T08:58:38+05:30 IST

కాలువ కాంక్రీట్‌కు పగుళ్లు లేవు

కాలువ కాంక్రీట్‌కు పగుళ్లు లేవు

వర్షంతో సీసీ కెనాల్‌పై మట్టి పేరుకుపోయింది

కాళేశ్వరం ప్రాజెక్టు డీఈఈ ప్రకాశ్‌


భూపాలపల్లి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం సమీపంలోని గ్రావిటీ కెనాల్‌కు పగుళ్లు లేవని కాళేశ్వరం డీఈఈ ప్రకాశ్‌ తెలిపారు. గురువారం ‘ఆంధ్రజ్యోతి’ లో వచ్చిన కథనంపై ఆయన వివరణ ఇచ్చారు. కన్నెపల్లి పంపుహౌజ్‌ నుంచి అన్నారం బ్యారేజీ వరకు 13.54 కిలో మీటర్ల కాలువ ఉందని, అందులో ఎడమ వైపు 6.35కిలో మీటరు దూరంలో ఓ చోట ఇటీవల భారీ వర్షాలకు కాలువ లైనింగ్‌పైకి మట్టి జారిందని తెలిపారు. కాలువ లైనింగ్‌ మీదకు మట్టి పేరుకుపోవడంతో అక్కడక్కడ లైనింగ్‌ కనిపించకుండా పోయిందన్నారు. దీంతో కెనాల్‌ కాంక్రీట్‌ పగుళ్లుగా భావించారని పేర్కొన్నారు. కెనాల్‌ కాంక్రీట్‌కు ఎలాంటి పగుళ్లు లేవని డీఈఈ స్పష్టం చేశారు. గురువారం ఉదయం కెనాల్‌ వద్ద మట్టిన తీసేసి మరమ్మతుల పనులు చేపట్టారు. 

Updated Date - 2020-07-10T08:58:38+05:30 IST