3 కోట్ల విరాళమిచ్చిన ఖజానా జువెలర్స్‌

ABN , First Publish Date - 2020-09-12T08:25:48+05:30 IST

కరోనా సంక్షోభంలో ప్రభుత్వానికి ఖాజానా జువెలర్స్‌ రూ.3 కోట్లను విరాళంగా అందించింది. పంచాయతీరాజ్‌,

3 కోట్ల విరాళమిచ్చిన ఖజానా జువెలర్స్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కరోనా సంక్షోభంలో ప్రభుత్వానికి ఖాజానా జువెలర్స్‌ రూ.3 కోట్లను విరాళంగా అందించింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో ఖజానా జువెలర్స్‌ యజమాని కిశోర్‌ కుమార్‌ రూ.3 కోట్లను మునిసిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌కు శుక్రవారం అందించారు.

కరోనా వైరస్‌ నిర్మూలన, బాధితుల సంరక్షణ కోసం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి ఆ నిధులను వినియోగించాలని కిశోర్‌ కోరారు. ఆయన ఔదార్యాన్ని కేటీఆర్‌ అభినందించారు. ఇటువంటి సమయంలో చేసే సహాయం ఏదైనా చాలా గొప్పదన్నారు.


Updated Date - 2020-09-12T08:25:48+05:30 IST