రైతులకు నేడు బ్లాక్‌ డే: ఎంపీ నామా

ABN , First Publish Date - 2020-09-20T22:06:38+05:30 IST

జై జవాన్‌, జై కిసాన్‌ నినాదం మనదని, సిపాయి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం రైతు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని

రైతులకు నేడు బ్లాక్‌ డే: ఎంపీ నామా

ఢిల్లీ: జై జవాన్‌, జై కిసాన్‌ నినాదం మనదని, సిపాయి, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం రైతు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని, వ్యవసాయాన్ని ప్రైవేటీకరించేందుకు కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ బిల్లును ఏకపక్షంగా ఆమోదించారని, బిల్లుపై ఓటింగ్‌ ఎందుకు నిర్వహించలేదు? అని నామా ప్రశ్నించారు. రైతులకు నేడు బ్లాక్‌ డే అని అన్నారు. దేశవ్యాప్తంగా త్వరలో రైతులు ఆందోళన చేస్తారని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల గొంతు నొక్కుతోందని నామా నాగేశ్వరరావు ధ్వజమెత్తారు.


Updated Date - 2020-09-20T22:06:38+05:30 IST