డబ్బులు ఆ ఇంట్లోనే పట్టుబడ్డాయి

ABN , First Publish Date - 2020-10-28T06:45:21+05:30 IST

సిద్దిపేటలో సురభి అంజన్‌రావు ఇంట్లోనే డబ్బులు పట్టుబడ్డాయని పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన

డబ్బులు ఆ ఇంట్లోనే పట్టుబడ్డాయి

సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌

 ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ర్టేట్‌ సమక్షంలో తనిఖీలు

సెర్చ్‌ నోటీసు ముందుగానే ఇచ్చాం: సిద్దిపేట సీపీ

సంజయ్‌కి రావద్దని చెప్పినా వచ్చారు


సిద్దిపేట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేటలో సురభి అంజన్‌రావు ఇంట్లోనే డబ్బులు పట్టుబడ్డాయని పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ మరోసారి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను బయటపెట్టారు. పోలీసులే డబ్బు పెట్టారంటూ ఆరోపణలు చేయడం బాధాకరమని అన్నారు. సెలెక్టివ్‌గా ప్రజలను డైవర్ట్‌ చేశారని ఆరోపించారు. మంగళవారం సిద్దిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫిర్యాదు వచ్చిన వెంటనే తహసీల్దార్‌, ఏసీపీ, సీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం సోమవారం రాంగోపాల్‌రావు,  అంజన్‌రావు ఇళ్లకు వెళ్లిందని, ముందుగానే సెర్చ్‌ నోటీసు ఇచ్చామని తెలిపారు.


అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షలు పట్టుబడ్డాయని, ఆయన భార్య ఆ డబ్బులను కవర్‌లో వేసి  అప్పగించిందని పేర్కొన్నారు. అభ్యర్థి రఘునందన్‌ అనుచరులు రూ.12.80 లక్షలు ఎత్తుకెళ్లారని తెలిపారు. 30 మందిని గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. శాంతిభద్రతల రీత్యా రావొద్దని చెప్పినా.. వచ్చినందు కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకొని కరీంనగర్‌ పంపించామన్నారు. నిబంధనల ప్రకారమే విధులు నిర్వహించామని, ఎవరు సమాచారం ఇచ్చినా తనిఖీలు చేయడం తమ బాధ్యత అని చెప్పారు. 


Updated Date - 2020-10-28T06:45:21+05:30 IST