శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

ABN , First Publish Date - 2020-08-20T16:58:54+05:30 IST

శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వరద ప్రవాహం పెరిగింది.

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. మహారాష్ట్ర నుంచి గోదావరిలోకి వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో  84,677 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 883 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా... ప్రస్తుత నీటి మట్టం 1084.4 అడుగులకు చేరింది. అలాగే నీటి సామర్థ్యం 90 టీఎంసీలకు గాను...ప్రస్తుతం 64 టీఎంసీలుగా ఉంది. 

Updated Date - 2020-08-20T16:58:54+05:30 IST