పోలీసుల అదుపులో ఎన్డీ నేత సూర్యం

ABN , First Publish Date - 2020-05-13T09:46:58+05:30 IST

సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత దళనేత సోమ భాస్కర్‌ అలియాస్‌ సూర్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి

పోలీసుల అదుపులో ఎన్డీ నేత సూర్యం

నల్లబెల్లి/హైదరాబాద్‌, మే 12: సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాయల వర్గానికి చెందిన అజ్ఞాత దళనేత సోమ భాస్కర్‌ అలియాస్‌ సూర్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి అనుచరుడు శ్యామ్‌తో కలిసి సూర్యం ఆస్పత్రికి వెళ్తుండగా వరంగల్‌ రూరల్‌ జిల్లా నల్లబెల్లి మండలం అటవీ ప్రాంతంలో వలపన్ని పట్టుకున్నట్లు సమాచారం. పార్టీ రెండు వర్గాలుగా చీలిన నాటి నుంచి సూర్యం అజ్ఞాతం వీడాలని యోచిస్తున్నట్లు పార్టీ శ్రేణుల ద్వారా తెలిసింది. దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన సూర్యం 1999లో పీవైఎల్‌ జిల్లా కార్యదర్శిగా పని చేశాడు. 2001లో న్యూడెమోక్రసీలో చేరి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కాగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న సూర్యం, శ్యామ్‌లను తక్షణం కోర్టులో హాజరు పర్చాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. 

Read more