నియంత్రణ చర్యలకు నీళ్లొదిలేస్తున్నారు!

ABN , First Publish Date - 2020-07-27T09:10:02+05:30 IST

నగరంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. ప్రభుత్వ విభాగాలు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. వైరస్‌ నియంత్రణ చర్యల విషయం

నియంత్రణ చర్యలకు నీళ్లొదిలేస్తున్నారు!

  • కేసులొచ్చిన ప్రాంతాల్లో కట్టడి లేదు..
  • శానిటైజేషన్‌  కూడా చేయని వైనం
  • అధికారులపై పనిభారమే కారణం

హైదరాబాద్‌ సిటీ, జూలై 26(ఆంధ్రజ్యోతి): నగరంలో ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభిస్తుండగా.. ప్రభుత్వ విభాగాలు మాత్రం పట్టీపట్టనట్టు వ్యవహరిస్తున్నాయి. వైరస్‌ నియంత్రణ చర్యల విషయం అటుంచితే.. కనీసం పాజిటివ్‌ కేసు నమోదైన విషయం కూడా ఆ చుట్టుపక్కల ప్రజలకు తెలియజేయడం లేదు. లాక్‌డౌన్‌ సడలింపుతో వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకోగా.. అధికారుల బాధ్యతా రాహిత్య మూ దానికి తోడైంది. జాగ్రత్తలు పాటిస్తున్న వారు కూడా తమకు తెలియకుండానే వైరస్‌ బారిన పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రాకుండా పౌరులు స్వీయ నియంత్రణ పాటిస్తున్నా.. వైరస్‌ వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. రోజూ 600-700 కేసులు నమోదవుతున్నాయి.  


పని భారం.. పట్టని వైనం..

నిబంధనల ప్రకారం వైరస్‌ సోకిన వ్యక్తి ఇంటిని కట్టడి చేయాలి. కుటుంబ సభ్యు లు బయటకు రాకుండా హోం క్వారంటైన్‌ చేయా లి. ఆ ఇంటి చుట్టుపక్కల ఎంటమాలజీ విభాగం సోడియం హైపోక్లోరైట్‌ ద్రావకం పిచికారి చేయాలి. శానిటేషన్‌ సిబ్బంది బ్లీచింగ్‌  పౌడర్‌ చల్లాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో శానిటేషన్‌ చేయడం లేదు.  సిబ్బందిపై పనిభారం పెరగడం వల్లే యాంటీ లార్వల్‌ ఆపరేషన్‌, శానిటైజేషన్‌ చేయలేకపోతున్నట్లు ఎంటమాలజీ విభాగం అధికారులు చెబుతున్నారు. అధికారులు నియంత్రణ చర్యలు పూర్తిస్థాయిలో చేపట్టకపోవడం వల్లే వైరస్‌ వ్యాప్తి వేగం పుంజుకుందని నిపుణులు చెబుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన చాలా మంది ప్రస్తుతం హోం ఐసొలేషన్‌లో ఉంటున్నారు. తీవ్రమైన లక్షణాలు లేని వారిని ఇళ్లలోనే ఉంచి టెలిఫోనిక్‌ సేవలు అందిస్తున్నారు వైద్యులు. వారికి మందులు, మాస్కులు, శానిటైజర్లతో కూడిన కిట్‌ అందజేస్తున్నారు.


కానీ.. వీరిపై అధికారుల నియంత్రణ కరువైంది. కొందరు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. వీరి వల్ల ఇతరులు కరోనా బారిన పడే ప్రమాదముంది. హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారి కుటుంబీకులూ ఇళ్ల నుంచి బయటకు రాకూడదు. వారిని జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ విభాగాలు పర్యవేక్షించాలి. కానీ ఈ యంత్రాంగాలు పట్టించుకోకపోవడంతో హోం ఐసొలేషన్‌లో ఉన్న కుటుంబాలు గడపదాటుతున్నాయి. 

Updated Date - 2020-07-27T09:10:02+05:30 IST