భైంసా బాధితులకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయం

ABN , First Publish Date - 2020-02-08T11:04:48+05:30 IST

గత నెలలో నిర్మల్‌ జిల్లా భైంసాలో చోటు చేసుకున్న అల్లర్లలో కష్ట, నష్టాల పాలైన బాధితులను ఆదుకునేందుకు మున్నూరు

భైంసా బాధితులకు  రూ. 2 లక్షల ఆర్థిక సహాయం

అందచేసిన మున్నూరు కాపు  రాష్ట్ర మహాసభ 

భైంసా, ఫిబ్రవరి 7: గత నెలలో నిర్మల్‌ జిల్లా భైంసాలో చోటు చేసుకున్న అల్లర్లలో కష్ట, నష్టాల పాలైన బాధితులను ఆదుకునేందుకు మున్నూరు కాపు రాష్ట్ర మహాసభ రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. శుక్రవారం మహాసభ ప్రతినిధులు ఇక్కడి నిధి సేకరణ కమిటీ ప్రతినిధులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహాసభ అధ్యక్షుడు పుట్టం పురుషోత్తమ్‌ రావు మాట్లాడుతూ.. భైంసా అల్లర్లలో అనేక కుటుంబాలు కోలుకోలేని రీతిలో నష్టపోయాయన్నారు.  ఇలాంటి కుటుంబాలను ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 

Updated Date - 2020-02-08T11:04:48+05:30 IST