బోధనాస్పత్రుల్లో వైద్యసేవల పునరుద్ధరణ

ABN , First Publish Date - 2020-05-17T08:51:56+05:30 IST

ప్రభుత్వ బోధనాస్పత్రులు, ఈఎన్టీ వంటి ఇతర స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అన్ని వైద్య ేసవలను పునరుద్ధరించాలని వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.

బోధనాస్పత్రుల్లో వైద్యసేవల పునరుద్ధరణ

హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బోధనాస్పత్రులు, ఈఎన్టీ వంటి ఇతర స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అన్ని వైద్య ేసవలను పునరుద్ధరించాలని వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్క్‌లను ఉపయోగించాలని వైద్య సిబ్బందికి సూచించారు.  ప్రత్యేకంగా జ్వరం క్లినిక్‌లను నడపాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని గాంధీ, ఛాతీ ఆస్పత్రులు కరోనా నోడల్‌ కేంద్రాలుగా ఉంటాయని, సరోజినీ కంటి ఆస్పత్రిలో కొంతభాగం ఐసొలేషన్‌ కేంద్రంగా ఉంటుందన్నారు.

Updated Date - 2020-05-17T08:51:56+05:30 IST