సురక్షిత ప్రాంతంలో ధాన్యాన్ని భద్రపర్చాలి

ABN , First Publish Date - 2020-11-27T04:36:38+05:30 IST

సురక్షిత ప్రాంతంలో ధాన్యాన్ని భద్రపర్చాలి

సురక్షిత ప్రాంతంలో ధాన్యాన్ని భద్రపర్చాలి
లగచర్లలో ప్రకృతి వనం పనులనుపరిశీలిస్తున్న డీఆర్డీఏ పీడీ కృష్ణన్‌

బొంరాస్‌పేట్‌: తుఫాన్‌ నేపథ్యంలో ధాన్యంకొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని డీఆర్‌డీఏ పీడీ కృష్ణన్‌ సూచించారు. గురువారం బొంరాస్‌పేట్‌ మండలంలో పర్యటించిన ఆయన ఏర్పుమళ్ల, లగచర్ల గ్రామాల్లో ఉపాధిహామీలో కొనసాగుతున్న పల్లె ప్రకృతి వనాలు, హరితవనాలను పరిశీలించారు. ఆయా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తుఫాన్‌ ప్రభావంతో ధాన్యం పాడైపోకుండా కాపాడుకునేందుకు షెడ్లు, పాఠశాలల్లో ఉంచుకోవాలన్నారు. పీడీ వెంట ఎంపీడీవో హరినందన్‌రావు, సర్పంచ్‌లు, ఉపాధి సిబ్బంది ఉన్నారు. 


 జాగ్రత్తలు పాటించాలి

మర్పల్లి : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశముందని మండల వ్యవసాయ అధికారి వసంత గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని పత్తి, మొక్కజొన్న రైతులు కోత పనులు నిలిపివేయాలని, ఒక వేళ కోత కోసినట్లయితే ఒక చోట కుప్పగా ఏర్పాటు చేసుకుని సురక్షితంగా ఉంచుకునేలా చూసుకోవాలని ఆమె సూచించారు. 

Updated Date - 2020-11-27T04:36:38+05:30 IST