పీవీఎక్స్‌ప్రెస్‌ వేపై రెండు ప్రమాదాలు... ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2020-09-20T16:25:48+05:30 IST

రాజేంద్రనగర్ పరిధిలోని పీవీ ఎక్స్ ప్రెస్ వేపై ఆదివారం జరిగిని రెండు వేరువేరు ప్రమాదాంలో ముగ్గురు గాయాలపాలయ్యారు.

పీవీఎక్స్‌ప్రెస్‌ వేపై రెండు ప్రమాదాలు... ముగ్గురికి గాయాలు

రంగారెడ్డి: రాజేంద్రనగర్ పరిధిలోని పీవీ ఎక్స్ ప్రెస్ వేపై ఆదివారం జరిగిని రెండు వేరువేరు ప్రమాదాంలో ముగ్గురు గాయాలపాలయ్యారు.  పిల్లర్ నెంబర్-158 వద్ద శంషాబాద్ నుండి మెహిదీపట్నం పైపు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న కరెంటు పోల్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.


మరోవైపు అదే పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేపై మరో ప్రమాదం చోటు చేసుకుంది.  మెహిదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్తున్నా ఇన్నోవా కారు డివైడర్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో కారులో నలుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. 


Updated Date - 2020-09-20T16:25:48+05:30 IST