దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్‌సింగ్

ABN , First Publish Date - 2020-12-19T16:25:52+05:30 IST

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఆదివారం ఉదయం పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది.

దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండాలి: రాజ్‌నాథ్‌సింగ్

హైదరాబాద్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో శనివారం ఉదయం పాసింగ్ అవుట్ పెరేడ్ జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడేట్లు పాసింగ్ అవుట్ పెరేడ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ.. వాయు సేన అందిస్తున్న సేవలు అభినందనీయమని, ఈ అకాడమీ ఎంతోమంది వీరులను దేశానికి అందించిందని కొనియాడారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.


ఉగ్రవాదంపై భారత సైన్యం ఎనలేని పోరు చేస్తోందని రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. బాలకోట్ ఘటన అందరికీ తెలిసిందేనన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఇప్పుడు చాలా కీలకమని, వాయుసేన అందిస్తున్న సేవలు అనిర్వచనీయమన్నారు. ఎయిర్‌ఫోర్స్ సంక్షేమం కోసం ప్రభుత్వం వెనకడుగు వేయదని రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-12-19T16:25:52+05:30 IST